Mohammad Rizwan The Real Warrior | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-11-12 774

T20 world cup 2021 : Mohammad Rizwan spent two nights in ICU before semi-final, photos emerge after Pakistan lose to Australia
#MohammadRizwan
#Pakcricketteam
#T20WORLDCUP2021
#Babarazam

దేశానికి ప్రాతినిథ్యం వ‌హించాల‌ని ప్రతిఒక్క క్రికెటర్ కల కంటాడు. అయితే ఆ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. కొంతమంది ఆటగాళ్లకు ఎంతో ప్రతిభ ఉన్నా.. ఒక్కోసారి అదృష్టం కలిసిరాదు. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంటే కానీ.. జాతీయ జట్టులో ఓ క్రికెటర్ ఆడలేడు. ఇక వచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఆటగాడు కష్టపడతాడు. ఈ క్రమంలోనే జట్టుకు విజయాలు అందించడానికి తన వంతు కృషి చేస్తాడు. అయితే పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహ్మద్ రిజ్వాన్ మాత్రం ప్రాణాలకు తెగించి మరీ దేశం కోసం మ్యాచ్ ఆడాడు. అంతేకాదు హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో అతడిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.